ప్రధాని మోదీ చెప్పిన ‘ప్రికాషన్​ డోసు’ అంటే ఏంటో తెలుసా?

Do you know what 'precision dose' Modi means?

0
90

గత రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

అలాగే 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు అందరూ బూస్టర్‌ డోసు గురించి మాట్లాడుతుండగా ప్రధాని తొలిసారిగా ‘ప్రికాషన్‌ డోసు’ అనే పదబంధాన్ని ప్రయోగించారు.  ప్రజలు ప్రికాషన్​ డోసు పేరు వినడం ఇదే తొలిసారి. ఇంతకీ ఈ ప్రికాషన్​ డోసు అంటే ఏంటి? బూస్టర్​ డోసు, ప్రికాషన్​ డోసుకు మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీకా రెండు డోసులు పూర్తి చేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు.. అదనంగా మరో డోసు ఇవ్వనున్నట్టు ప్రకటించారు మోదీ. ప్రికాషన్​ డోసుకు ప్రస్తుతం సరైన నిర్వచనం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్న వారు..మూడో డోసుగా వేరే రకం వ్యాక్సిన్​ను తీసుకోవడాన్ని ప్రికాషన్​ డోసు అనొచ్చని కొవిడ్​ వ్యాక్సినేషన్​ సాంకేతిక బృందం చెబుతోంది.

అంటే.. కొవాగ్జిన్​ టీకాలు తీసుకున్నవారికి మరో డోసుగా.. ఇతర వ్యాక్సిన్లు ఇవ్వడం అని అర్థం. ఇదే నిజమైతే.. మూడో డోసు తీసుకున్నామంటే..అది పూర్తిగా కొత్త టీకా అవుతుంది. రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బూస్టర్​ డోసు అంటే.. అప్పటికే తీసుకున్న రెండు డోసులకు అదనంగా మరో డోసు (అదే రకం వ్యాక్సిన్​) తీసుకోవడం.