మన తెలుగు నెలల్లో శ్రావణమాసానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది. మహిళలకు ఇది అత్యంత ముఖ్యమైన నెలగా చెబుతారు. ఆగస్టు 9న మొదలై, సెప్టెంబర్ 7న ముగుస్తుంది ఈ శ్రావణమాసం. ఈతొలి రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం మొదలవుతుంది.ఇప్పటి నుంచి దీపావళి వరకూ అనేక పండుగలు వస్తూ ఉంటాయి.
పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజూ నైవేద్యం సమర్పిస్తారు. ఇక ఉపవాసాలు ఉంటారు. ఈనెలలో అసలు నాన్ వెజ్ ఎవరూ తీసుకోరు. ఈ శ్రావణ మాసంలో స్వామి వారికి అమ్మవారికి పూజలు చేస్తారు. ప్రధానంగా శ్రావణమాసంలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి , శివుడికి పూజలు చేస్తారు.
అలాగే వరలక్ష్మీ వ్రతం పూజలు చేసి అమ్మవారిని కొలుస్తారు. ఈ నెలలో కుంకుమ పూజతో పార్వతీదేవిని పూజిస్తారు. అలాగే మంగళ గౌరీ వ్రతం చేస్తారు. ఉపవాసం వల్ల శరీరంలో ఉన్న చెడు కొవ్వు పోతుంది అని భావిస్తారు. ఇక ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడతాయి.