ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఏ వైపుకు తిరిగి పాడుకుంటున్నాము అనేది కూడా తెలిసి ఉన్నప్పుడే ఆరోగ్య పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
మనలో చాలామంది రాత్రి నిద్రించే ముందు ఏ వైపుకు తిరిగి పాడుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకే అలాంటి వారు పడుకునే విధానానికి ఆరోగ్య సూత్రాలు ఎంతగానో తెలుసుకోవాల్సి ఉంటుంది. నిద్ర ఎప్పుడూ ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల సూర్యనాడి తిన్న భోజనం జీర్ణం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఎడమవైపుకి తిరిగి కొద్దిసేపు పడుకుంటే శరీరానికి ఎలాంటి హాని చేకూరదు. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రక్ర ప్రసరణ బాగా జరగడంతో పాటు..పిండం కూడా దృడంగా ఉంటుంది. ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.