Home SPECIAL STORIES Flash: వాహనదారులకు భారీ షాక్‌..మళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు…

Flash: వాహనదారులకు భారీ షాక్‌..మళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు…

0
171

దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. తాజాగా ఇంధన ధరలు కూడా పెంచి వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చారు.

వారం రోజుల క్రితం భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళి పెరిగి వాహనదారులకు కోలుకొని షాక్ ఇచ్చాయి. లీటరు పెట్రోల్ ధరపై 17 పైసలు పెరగడంతో ధర ఆకాశానికి ఎగబాకుతూ రూ.109.83కు చేరుకుంది. ఇక డీజిల్ ధర విషయానికొస్తే  16 పైసలు పెరగడంతో రూ.97.98గా కొనసాగుతుంది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.83, డీజిల్ ధర రూ.111.92గా కొససాగుతుంది. ఈ పెరిగిన ఇంధన ధరలతో వాహనదారులు రోడ్డుమీదికి ఎక్కాలంటేనే జంకుతున్నారు.