మాంసాహారం వండేటప్పుడు బొప్పాయి కాయ ముక్కలు ఎందుకు వేస్తారో తెలుసా

Do you know why papaya slices are used when cooking meat?

0
172

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వైద్యులు కూడా అదే చెబుతారు బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని. బీటాకెరోటిన్ విటమిన్ సి, రెబోఫ్లేవిన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా మలబద్దకంతో ఇబ్బంది పడుతుంటే ఇది తగ్గిస్తుంది. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది.

మన దేశానికి ఈ పండు నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చింది అని చెబుతారు నిపుణులు. బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. డెంగ్యూవ్యాధిని నివారిస్తుంది. ఇది తింటే కడుపునిండినభావన కలుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలు వేస్తారు ఎందుకంటే ఇందులో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి ఉపకరిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది అందుకే దీనిని మన పెద్దలు మాంసం కూరలు వండేటప్పుడు వేస్తారు.. బ్యూటీక్రీమ్లు, బ్యూటీ లోషన్లలో ఈ పండును ఎక్కువగా వాడతారు.