మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళతాం, ఈ సమయంలో వెంటనే మన పల్స్ చూసి అలాగే మన నాలుక తెరవమని చెబుతారు, అసలు ఎందుకు ఇలా డాక్టర్ అడుగుతారు అని చాలా మందికి డౌట్.
అయితే దీని వల్ల మన ఆరోగ్యం తెలుస్తుంది వైద్యులకి, ఇక్కడ ఓ విషయం గుర్తు ఉంచుకోండి, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుందట. ఒక వేళ ఇలా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే.
ఇక నాలుక ఉదా రంగులో ఉంటే రక్తప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థమట. అంతేకాదు కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి అని చెబుతారు, ఇక నాలుక పాలిపోయినట్లు అనిపిస్తే రక్తహీనత ఉన్నట్లేనని భావిస్తారు వైద్యులు… ఈ సమయంలో మంచి ఆహరం తీసుకోవాలి, పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు వైద్యులు. ఎర్రరంగులో ఉంటే మాత్రం విటమిన్ బి లోపం ఉందని చెపుతారు. ఒక వేళ రోగ నిరోధక శక్తి బాగా తగ్గితే నోటిలో పుండ్లు బాగా పడతాయి, ఇలా తరచూ వస్తే మాత్రం వైద్యులని సంప్రదించాలి.