ద్రాక్షపళ్ళు తినడానికి ఇష్టపడుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

0
48

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ద్రాక్ష పళ్లు తియ్యగా, టేస్టీగా ఉంటాయని లెక్కలేనన్ని తింటుంటారు. కానీ అధికంగా తింటే ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి..

ద్రాక్షలో చక్కర అధికంగా ఉండడం వల్ల విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సన్నగా కావాలనుకునే వారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మూత్రపిండవ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకోకపోవడం మంచిది, లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు.

ద్రాక్షను అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల కిడ్నీ సంబంధిత సమస్యలుకూడా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చేతులు, కాళ్ళలో అలెర్జీ సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా గర్భస్థ స్రీలు ద్రాక్షను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ద్రాక్షను పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిది.