మారుతున్న జీవన విధానంతో పనుల హడావిడిలో పడి చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేరు. మన శరీరం ఎంత కష్టపడినా కానీ, మెదడుకు విశ్రాంతిని ఇచ్చే నిద్రను మాత్రం మానకూడదు. నిద్రపోకపోవడం అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా నిద్రలేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యనాల్లో వెల్లడయ్యింది.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అధికంగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది టైప్ 2 డయాబెటిస్ వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజుకు కనీసం 8గంటల సమయం నిద్రపోవడానికి కేటాయించాలి.
అంతేకాకుండా నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం దాదాపు 4 రెట్లు అధికం అవుతుంది. శరీరంలో ఎంతో సున్నితంగా ఉండే మెదడుపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. రాత్రివేళలో మెదడు విశ్రాంతి తీసుకొని..మెదడులో ఉండే వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. అందుకే రాత్రి సమయంలో చక్కగా నిద్రపోండి.