మీరు అలర్జీతో బాధపడుతున్నారా? కారణం, నివారణ మార్గాలు ఇవిగో..

0
114

ప్రస్తుత కాలంలో ఎక్కువగా వేధించే సమస్యల్లో ఒకటి అలర్జీ..వర్షాకాలంలో అనేక రకాల అలర్జీ ట్రిగ్గర్లు వెంటాడుతాయి. వర్షం వల్ల స్వచ్ఛమైన గాలితో అనేక రకాల అలర్జీలు వస్తాయి. మరి అలర్జీలకు గల కారణాలు ఏంటి? నివారణ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అలెర్జీలకు కారణం:

కళ్ల దురద, ముక్కు కారడం, తుమ్ములు, శ్వాసలో గురక అనిపించడం అలర్జీకి సంకేతం. ఇంట్లో ఉంటూ కూడా ఇలాంటి ఇబ్బందిని అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఇంట్లోని వస్తువులే కావచ్చు. ఇంట్లో అలర్జీకి కారణమయ్యే అనేక వస్తువులు ఉన్నాయి.

ఇంట్లో ఉండే వస్తువులపై దుమ్ము, పురుగులు

బొద్దింక రెట్టలు

రిమోట్

మొబైల్ మొదలైన వాటిపై దుమ్ము.

అలెర్జీని తగ్గించే మార్గాలు ఇవే..

కాలుష్యం పెరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు.

అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో మీ ఇంటి కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచండి.

రోజూ తలస్నానం చేయండి

బయటి నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతకాలి.

బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.

ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

బయటి నుంచి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలర్జీలను ఇతర మార్గాల్లో నివారించవచ్చు.