వేసవిలో ఇంతకీ మించి గుడ్లు తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త

0
90

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు మనకు ఏ చిన్న సమస్య వచ్చిన గుడ్లు తీసుకోమని సూచిస్తారు. కానీ వేసవిలో తింటే వేడి చేస్తుందని కొందరు అనుమాన పడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమేనని వైద్యులు అంటున్నారు.

గుడ్డులో విటమిన్ బి, విటమిన్ డి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. కానీ వేసవిలో రెండు గుడ్లు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటేనే ఒంట్లో వేడి ఎక్కువవుతుంది. అందుకే ఏదైనా మితంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. గుడ్లను తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.