జుట్టు ఊడిపోతుందా? అయితే ఇవి మీ డైట్ లో తప్పక చేర్చండి..

0
36

మనిషికి జుట్టే అందం అని అందరికి తెలుసు. కానీ ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడి వల్ల, ఆహార పదార్థాల విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఈ సమస్య అధికం అవుతుంది. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే కూరగాయలు సైతం సహాయపడతాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చాలామందిలో ఐరన్ లోపం కారణంగానే జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి వారిలో కురులను దృఢంగా ఉంచడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది. క్యారట్ కూడా వెంట్రుకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉల్లిపాయలు కూడా జుట్టు రాలకుండా సహాయపడతాయి.  కరివేపాకులో జుట్టు రాలిపోవడాన్ని తగ్గించే సుగుణాలున్నాయి. గుమ్మడి, అవిసె గింజలు సైతం కురులు దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి.