అతి మూత్ర సమస్య వేధిస్తోందా ? వైద్యులు ఏం చెబుతున్నారంటే

doctors suggestion for urinary incontinence

0
89

 

ఈరోజుల్లో చాలా మందికి అధిక మూత్రం సమస్య వేధిస్తోంది.మూత్రాశయం నిండినప్పుడు నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది ఈ విషయం. అప్పుడు మనకు టాయిలెట్కు వెళ్లాలనిపిస్తుంది.ఒక్కోసారి అసలు కంట్రోల్ చేసుకోలేరు. ఇలా అతి మూత్రం సమస్య వేధిస్తుంది పురుషులకి , స్త్రీలకి. అయితే నీరు ఎక్కువ తాగినా, షుగర్ సమస్య ఉన్నా మూత్రం సమస్య వస్తుందని చాలా మంది భావిస్తారు. అసలు వాస్తవాలు తెలుసుకుందాం.

మనిషి రోజులో 8 కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే. దీనిని ఈజీగా గుర్తించాలి అంటే ఇదే లెక్క. ఇక రాత్రి ఐదారుసార్లు మూత్రానికి వెళుతున్నారు అంటే ఇది మూత్ర సమస్య. ఇక లో దుస్తుల్లో మూత్రం పడుతున్నా ఇది సమస్యగానే గుర్తించాలి.

దగ్గినా, తుమ్మినా మూత్రం చుక్కలుగా పడుతోందని పలువురు చెప్తుంటారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో వస్తుంది. ఇక మూత్రం లీక్ అవ్వడం తరచూ మూత్రానికి వెళ్లే సమస్య ఉంటే కచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాలి. మధుమేహం నియంత్రణలో లేకపోవడం వల్ల అతిమూత్రం సమస్య ఏర్పడుతుంది. రోజుకి ఐదు లీటర్ల నీరు తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు. నీరు ఎక్కువ తాగడానికి అతి మూత్రానికి, మూత్రం లీక్ అవ్వడానికి సంబంధం లేదు.