చేప కడుపులో ఏముందో చూసి షాకైన వైద్యులు

-

మనం ప్లాస్టిక్ వస్తువులు తెగ వాడుతూ ఉంటాం, ఇవి వాడవద్దు అని ఎంత చెప్పినా బయటకు ఎలాంటి సంచి
తీసుకువెళ్లకుండా కవర్ కావాలి అని షాపు వారిని అడుగుతాం… ప్రభుత్వాలు భూమిలో కలవని ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పినా ఇంకా ఈ వాడం బాగా పెరిగింది… అయితే దీని వల్ల అనేక జంతువులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక అనేకసార్లు ఆవులు గేదెలు ఇలాంటి ప్లాస్టిక్  వస్తువులు తిని ఇబ్బంది పడటం చూశాం… అయితే సముద్రంలో ఉండే జీవులపై కూడా ఇది ప్రభావం చూపుతోంది.
 ఓ చేప కడుపులో దాదాపు 10 కిలోల ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలు బయటపడ్డాయి. కర్ణాటకలోని అట్టావర్ లోని ఓ చేపల దుకాణంలో సోమవారం ఈ ఘటన జరిగింది.  ఆ వ్యాపారి ఆ చేప కోస్తున్న సమయంలో అందులో ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్ధాలు బయటకు వచ్చాయి….అవి చూస్తే మొత్తం 10 కిలోల బరువు ఉన్నాయి.
వాస్తవానికి చేపలు ప్లాస్టిక్ తినవు, కాని  మైక్రో ప్లాస్టిక్ లను చేపలు తెలియకుండా తినేస్తుంటాయి. అని వైద్యులు చెబుతున్నారు ఈ చేప కూడా ఇలా తిని ఉంటుంది అని తెలియచేశారు… మొత్తానికి ఎంత ప్లాస్టిక్ మన సముద్రంలో కలుస్తుందో  ఈ ఘటనతో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు జంతు ప్రేమికులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...