వేసవిలో ఏసీ కారణంగా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే ఇలా చేయండి..

0
125

వేసవి కలం వచ్చిందంటే చాలు.. ప్రజలు ఏసీలో ఉండడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఇలా రోజంతా ఏసీలో గడపడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా చేకూరే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు సహజమైన గాలి కూడా పీల్చుకుంటూ ఉండాలి.

కానీ ప్రస్తుతం ఎండలు ముదరడంతో ఏసీలోనే ఎక్కువ సమయం గడపాలని ఉన్న..ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుందేమోనని భయపడుతున్నారు. అందుకే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి కరెంటును ఆదా చేసుకోండి. కొంతమంది రాత్రి పూత ఏసీ ఆపడం మర్చిపోతూ ఉంటారు. దీనివల్ల ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది. అందుకే ఏసీలో టైమర్ సెట్ చేయడం వల్ల అదే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. అందువల్ల  కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది.

అంతేకాకుండా ఏసీ వేసుకునేటప్పుడు 24 డిగ్రీల వద్ద ఉంచితే బిల్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సర్వీసింగ్ చేయించడం వల్ల కూడా కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. చాలా మందికి పవర్ బటన్ ని ఆఫ్ చేసే అలవాటు ఉండదు. దానివల్ల వాడకుండా కూడా బిల్లు అయిపోతుంది. ఎక్కువ సేపు రూమ్ చల్లగా ఉండాలంటే కొంచెం గాలి కూడా లోపలికి రాకుండా అన్ని మూసేయాలి.