నానబెట్టిన బాదం తినొచ్చా లేదా అని సందేహపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

0
125

చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడేవాటిలో బాదం పప్పు కూడా తప్పకుండా ఉంటుంది. అయితే ఇవి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇందులో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది.

కానీ చాలామంది ఈ బాదం పప్పు నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని సందేహపడుతుంటారు. కానీ బాదం పప్పు నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. బాదం పప్పును నానబెట్టి ప్రతిరోజు తింటే జ్ఞాపకశక్తి పెంపొందడంతో పాటు..గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బాదం పప్పులో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. కావున నానబెట్టినప్పుడు ఆ తొక్క ఊడిపోయి మన శరీరానికి ఎలాంటి హాని చేకూరుతుంది. ఇంకా బాదంపప్పు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు రాత్రి నానబెట్టి రోజు ఉదయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. బాదంపప్పు తినడం వల్ల ఈ ఆకలి అనిపించక త్వరగా బరువు తగ్గుతారు.