ఉల్లిపాయలను కూరల్లో అధికంగా వేస్తే ప్రమాదం పొంచిఉన్నట్టే..!

0
41

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మనకు తెలియక చేసే తప్పుల వల్ల కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.  ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వంటల్లో అధికంగా వేస్తుంటారు. కానీ అలా వేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఉల్లిపాయలను పరిమిత స్థాయిలో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో అనేక పోష‌కాలు ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. వాటిల్లో ఫ్ర‌క్టేన్ అనే పోష‌క ప‌దార్థం ఉంటుంది. కావున అధికంగా తిన్నప్పుడు జీర్ణాశయంలో ఫ్ర‌క్టేన్ పేరుకుపోయి వివిధ రకాల సమస్యలకు దారి తీస్తుంది.

దీనివల్ల గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. రోజుకు 50 నుంచి 80 గ్రాముల ఉల్లిపాయ‌ల‌ను తినడం వల్ల ఎలాంటి హాని జరగకపోగా..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా సీజ‌న‌ల్ వ్యాధులు కూడా రాకుండాకాపాడుతుంది. అలాగే షుగ‌ర్, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.