ఈ సమస్యలు తొలగిపోవాలంటే గోరువెచ్చని నీళ్లు తాగాల్సిందే!

Drink hot water to get rid of these problems!

0
90

ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. ప్రతిరోజూ దాదాపు 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. అయితే వ్యాధులు ప్రబలే చలికాలం, వానాకాలం సమయాలలో అయితే వేడి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

శ్వాస:

వేడి నీళ్లు తాగడం వల్ల జలుబు ఫ్లూ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. అలానే జలుబు, దగ్గు, గొంతు సమస్యలు కూడా ఉండవు కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇలా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఎన్నో లాభాలు మనం పొందొచ్చు.

హైడ్రేట్:

మనం రోజూ ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. పురుషుల రోజుకి మూడు లీటర్లు నీళ్లు, మహిళలు రెండు లీటర్ల నీళ్లు తాగాలి. అలానే నీళ్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండాలి. వేడి నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉండొచ్చు.

వెచ్చగా:

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకుంటే ఒంట్లో వేడి ఉంటుంది. అలానే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ పై కూడా మంచి ప్రభావం పడుతుంది.

కాన్స్టిపేషన్ సమస్య:

గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య నుండి బయటపడచ్చు. కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవాళ్లు వేడి నీళ్లు తీసుకుంటే మంచిది.

మూడ్ ని ఇంప్రూవ్:

వేడి నీళ్లు తాగడం వల్ల మూడ్ కూడా బాగుంటుంది. అలానే నీరసం, దాహం కూడా తగ్గుతుంది.