ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో పేపర్ కప్స్‌లో టీ పోసి అతిధులకు తాగమని ఇస్తుంటారు. అంతేకాకుండా ఆఫీసుల్లో పనిచేసే కొందరు యువకులు కుడా పేపర్ కప్స్‌లో టీ తాగుతారు. కానీ అలా తాగడం వల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు టీ తాగడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయంటే ఇంకా పేపర్ కప్స్‌లో టీ తాగితే మీ పని అంతే. ఎందుకో మీరు కూడా చూడండి..
పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. వీటిని నేల మీద వేస్తే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకున్న వీటిలో టీ తాగితే మాత్రం మన శరీరానికి చాలా హాని చేకూరుతుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
డిస్పోజబుల్ పేపర్ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధనలో వెల్లడి కావడంతో వాటికీ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఐస్‌క్రీమ్ పార్లర్లలో వీటిని ఎక్కువగా వాడడం మనం గమనిస్తూనే ఉంటాము.