నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పరిమిత స్థాయిని మించి నీళ్లు తాగితే అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో వాస్తవమెంతో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..
అతిగా నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు అలసిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కిడ్నీలకు ఉండకా..ఆ నీరంతా రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల రక్తం పలుచబడి అందులో ఉండే సోడియం, ఎలక్ట్రోలైట్లు కూడా పలుచబడిపోతాయి. ముఖ్యంగా సోడియం పలుబచడడం వల్ల రక్త కణాల్లోకి నీరు చేరి ఉబ్బిపోయి రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
దీనివల్ల తల తిరగడం, గుండెలో ఇబ్బందిగా అనిపించడం, డయేరియా వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మోతాదుకు మించి తీసుకునే నీటి వల్ల మెదడు పనితీరు కూడా మారిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటిని నీరు తక్కువ కాకుండా, ఎక్కువ కాకుండా తాగితే శరీరానికి అద్బుతమైన మేలు చేకూరుతుంది.