Dry fruits instead food: ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలే ఆకాశాన్నంటుతున్న సమయంలో డ్రై ఫ్రూట్స్ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మామూలు రోజుల్లోనే డ్రై ఫ్రూట్స్ అధిక ధరలు పలుకుతుంటాయి. కానీ డ్రై ఫ్రూట్స్‌లో అధిక పోషక విలువలు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి.కానీ వాటిని కొనేందుకు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది కాబట్టి, మధ్యతరగతి వాళ్లు డ్రై ఫ్రూట్స్‌ను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కనుక డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు ఇతర ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే డ్రై ఫ్రూట్స్(Dry fruits)కు బదులుగా, వీటిని వాడొచ్చున్నమాట. అయితే అవి ఏమిటో తెలుసుకుందాం రండి.
వేరుశనగ
ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వేరుశనగలో పుష్కలంగా దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా వీటిని తీసుకోవచ్చు. వేరుశనగను ఏ రూపంలో తీసుకున్నా, వాటిల్లో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు చెప్తున్నారు. అయితే పిల్లలు వీటిని ఇష్టంగా తినటం కోసం చిక్కీలుగా చేసి ఇచ్చినా ఎంతో లాభం అంటున్నారు. చిక్కీలు తయారు చేయటానికి పల్లీలతో పాటు బెల్లం వాడటంతో.. పిల్లలకు తగిన స్థాయిలో ఐరన్ అందుతుందని వైద్యులు తెలుపుతున్నారు. వేరుశనగలను వేయించుకుని తిన్నా ఫర్వాలేదట.
సోయా బీన్స్
బాదంలో ఉన్న పోషకాలకు ఏమాత్రం తగ్గనట్లుగా సోయా బీన్స్‌లో ఉంటాయని నిపుణులు వెల్లడించారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వంటివి సోయాలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి బాదంకు ప్రత్యామ్నాయంగా సోయాను తీసుకోవచ్చు. మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గించేందుకు సోయా కీలక పాత్ర వహిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి సోయా సహాయం చేస్తాయి. నిద్ర లేమితో బాధపడే వారు సోయా బీన్స్‌ను తినటం ద్వారా నిద్ర రుగ్మతలను తరిమికొట్టవచ్చు. మరియు జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు కూడా సోయాబీన్స్‌ను ఉపయోగిస్తారు.
పుచ్చకాయ గింజలు
పుచ్చకాయ తినేటప్పుడు చాలా మంది గింజలను పడేస్తుంటారు. కానీ, పుచ్చకాయ గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చని, ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు.
అరటి పండ్లు
అరటిపండ్లలో ఫైబర్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్థమా, క్యాన్సర్, అజీర్తి, జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. అరటి పండ్లలో విటమిన్-C కూడా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.