ఈ నట్స్ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందట!!

-

Eat These Nuts to Improve Your Sex Life: బాదం, జీడిపప్పు, ఆక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్) చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉండటం దగ్గర్నుంచి. ఉత్సాహం, మేధోశక్తి, మూడ్ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. రోజుకు 60.. గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, ఆక్రోట్లు, హేజెల్ నట్స్ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. గింజపప్పులు జతచేసినవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. గింజపప్పుల్లో ప్రొటీన్, పీచు అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడేవే. వీటిల్లో పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ. వ్యవస్థకూ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి గింజపప్పులను జోడించినట్టయితే అంగ స్తంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...