ఆలస్యంగా తింటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్

Eating late? Shocking news for you though

0
37

మన రోగాల బారిన పడడానికి ఎన్నో కారణాలుంటాయి. మొదటగా ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసి ఒత్తిడి ఇలా తదితర కారణాల రోగాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే తినే ఆహార సమయ వేళల్లో సరిగ్గా పాటించకపోతే కూడా అనారోగ్యం బారిన పడుతుంటాము. మరి ఆహారం ఏ సమయంలో తినాలి? సమయానికి తినకుంటే కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం..

చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని సూచిస్తున్నారు.

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎక్కువగా రాత్రి పూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. అందుకే రాత్రి 9 గంటల లోపే భోజనం చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల డయాబెటిస్‌ -2, గుండె జబ్బులు తప్పవంటున్నారు. అందుకే పడుకునే సమయానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.