అల్లం అధికంగా తింటున్నారా? అయితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..

0
101

ప్రస్తుతం ప్రతీ ఇంట్లోనూ చేసే వంటల్లో అల్లం ఎక్కువగా వాడుతుంటారు. అల్లం వంటకు అధిక రుచిని ఇవ్వడమే కాదండోయ్. ఆరోగ్య సంరక్షని కూడా అందుకే అల్లం చాయ్, మసాలా చాయ్ మన దగ్గర ఫేమస్. అల్లం అనేక రోగాలకు చెక్ పెడుతూ మనిషిని ఉల్లాసంగా ఉంచుతుంది. అయితే అల్లం అధికంగా తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అల్లం అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి.

అల్లంను తినడం వల్ల నోట్లో దురద, చికాకుగా కూడా ఉంటుంది.

రక్తపోటు ఉన్న వారు అల్లం తినకుండా ఉంటేనే మంచిది. అలాగే అల్లం ఎక్కువగా తీసుకుంటే గుండెకు అనారోగ్యమే.

ఇక మరీ ముఖ్యంగా గర్భిణులు 1500mg కంటే ఎక్కువ అల్లం తీసుకుంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గర్భంతో వున్నప్పుడు అల్లం తక్కువ మోతాదులో తీసుకోవాలి.