క్రికెట్ లో కొత్త రూల్స్ రానున్నాయ్..అవి ఏంటో తెలుసా?

0
41

ఇకపై క్రికెట్ లో ఉన్న రూల్స్ మారనున్నాయి. గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫారసులను ఐసీసీ ఆమోదించింది. ఈ మేరకు కొత్త రూల్స్ ను వెల్లడించింది. అయితే ఈ రూల్స్ అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి.. మరి కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కరోనా పుణ్యమా అని బంతిపై ఉమ్మి రాయకుండా నిషేధించారు. ఇప్పుడు ఈ నిషేధాన్ని శాశ్వతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే స్ట్రైక్ లో ఉన్న స్థానంలో కొత్త బ్యాటర్ వస్తారు. ఒకవేళ బ్యాటర్లు ఇద్దరు ఒకరినొకరు క్రాస్ చేసిన పరిగణలోకి తీసుకోరు. అంటే వారి స్థానం మారదు.

టెస్టులు, వన్డేల్లో ఆటగాడు అవుట్ అయితే కొత్త ఆటగాడు 2 నిమిషాల్లో రావాలి. ఒకవేళ టీ20లో అయితే మాత్రం 90 సెకన్లలోనే స్ట్రైక్ తీసుకోడానికి సిద్ధంగా ఉండాలి.

బ్యాటర్ ఆడేటప్పుడు కొంతభాగం బ్యాట్ అయిన బ్యాటర్ అయిన పిచ్ పైనే ఉండాలి. ఒకవేళ బాల్ పిచ్ ధాటి పక్కకు వెళితే మాత్రం అది నోబాల్ గా ప్రకటిస్తారు.

ఇక మన్కడింగ్ పై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ఈ విధంగా అవుట్ చేస్తే అన్ ఫెయిర్ సెక్షన్ నుండి రన్ అవుట్ సెక్షన్ లోకి మార్చారు.