ఇది పరీక్షల సమయం మీ పిల్లల చదువుకోసం ఈ ఆహరం ఇవ్వండి

ఇది పరీక్షల సమయం మీ పిల్లల చదువుకోసం ఈ ఆహరం ఇవ్వండి

0
97

ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు బాగా చదవాలి అని ప్రయోజకులు అవ్వాలి అని కోరుకుంటారు.. ఈ సమయంలో వారు ఏది అడిగితే అది ఇస్తారు, వారిని గారం చేస్తారు, అయితే ఈరోజుల్లో బయటఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. పిల్లలకు కూడా ఇది పెట్టకండి.

ఇక పిల్లలకు ఇదిపరీక్షల సమయం కాబట్టి రాత్రి ఎక్కువ సమయం వరకూ చదువుకుంటారు, ఈ సమయంలో శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కాఫీలు టీలు మాత్రం ఇవ్వకండి, కేవలం పాలు మాత్రమే ఇవ్వండి అది కూడా తక్కువ షుగర్ వేసి ఇవ్వాలి.

ఇక ఆయిల్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ లాంటివి ఇవ్వకండి, మెదడు చురుగ్గా పని చేయదు, తేలికగా జీర్ణం అయ్యేవి ఇవ్వండి, డ్రై ఫ్రూట్స్ ఇస్తే బెటర్.. లేదా పీచు ఎక్కువ ఉండే పళ్లు ఇవ్వండి, ఇక డ్రింక్స్ లాంటివి కాకుండా సబ్జా గింజల నీరు, లేదా పుచ్చకాయ జ్యూస్ లాంటివి ఇవ్వండి ..మీ పిల్లలకు మంచి ఆరోగ్యం మంచి చదువు వస్తుంది.