గుడ్లు ఫ్రిజ్ లో నిలువ చేయవచ్చా- అవి తినవచ్చా వైద్యుల సలహా

గుడ్లు ఫ్రిజ్ లో నిలువ చేయవచ్చా- అవి తినవచ్చా వైద్యుల సలహా

0
115

ఈరోజుల్లో చాలా మంది గుడ్డు ట్రే తెచ్చుకుని ఓ వారం తింటున్నారు, వాటిని ఫ్రిజ్ లో పెట్టుకుని ఎప్పుడు ఏ ఆహారం కావాలి అంటే అది చేసుకుంటున్నారు.. ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ స్పైసీ ఆమ్లెట్ , ఎగ్ బిర్యానీ , ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీ, ఎగ్ రోస్ట్, ఇలా అన్నీ ఫ్రీజ్ లో ఉన్న గుడ్లు తీసి చేసుకునే వారు ఎక్కువగా ఉంటున్నారు, అయితే ఎగ్స్ ఫ్రిజ్ లో పెట్టవచ్చా అంటే వైద్యులు చెప్పేది ఏమిటి అంటే.

గుడ్లను ఇలా ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి తిన్నప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.
క్యాల్షియం, ప్రొటీన్ గుడ్లలో ఉంటాయి అవి సాధారణంగా ఉంటేనే ఉంటాయి ..ఫ్రిజ్ లో పెడితే పోతాయి.
ఒకేసారి ఫ్రిజ్ లోంచి తీసిన గుడ్లు అంటే చల్లటి వాతావరణంలో ఉన్న గుడ్లను రూమ్ టెంపరేచర్ కి తీసుకురాగానే
బ్యాక్టీరియా పెరిగే ఆస్కారం ఉంది.

అలా అని మరీ ఎక్కువ వేడి ఉన్న రూమ్ లో పెట్టకూడదు చలి ఉన్న ఫ్రిజ్ లో ఉంచకూడదు..గది ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచిన కోడి గుడ్లను ఆహారంగా తీసుకోండి, ఫ్రిజ్ లో అనేక బ్యాక్టిరీయాలు కూడా చేరే ప్రమాదం ఉంటుంది.
ఒకవేళ ఫ్రిజ్ నుంచి గుడ్లను తీశాక కనీసం 2 గంటల పాటు వాటిని బయటే ఉంచి, ఆతరువాత ఉపయోగించాలి.

గమనిక …మీరు గుడ్లని ఒక వారం కంటే ఎక్కువగా స్టోర్ చేయవద్దు వారం లేదా 8 రోజులు మించి గుడ్లు వాడద్దు అంటున్నారు నిఫుణులు ఫ్రెష్ గా వాడాలి అని చెబుతున్నారు.