ఈ కషాయంతో వానాకాలంలో వచ్చే జలుబు దగ్గుకి చెక్ పెట్టవచ్చు

ఈ కషాయంతో వానాకాలంలో వచ్చే జలుబు దగ్గుకి చెక్ పెట్టవచ్చు

0
47

ఈ వర్షాకాలంలో వానలో తడిస్తే వెంటనే జలుబు చేస్తుంది … తలనొప్పి అక్కడ నుంచి జ్వరం ఈ సమస్య నాలుగు లేదా వారం రోజుల వరకూ వేధిస్తుంది, అయితే ఈ జలుబు సమస్య రాకుండా ఉండాలి అంటే అసలు వర్షంలో తడవకూడదు, బూజులు లాంటివి దులపకూడదు.

అయితే ఈ వానాకాలంలో సీజనల్ వ్యాధులు వైరస్ లు కూడా విజృంభిస్తాయి.అందుకే ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజూ ఓ కషాయం చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు.

మరి ఆ కషాయం తయారీ చూద్దాం
చిన్న అల్లంముక్క, అర చెంచా తేనె, నిమ్మకాయ, గుప్పెడు తులసి ఆకులు, చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు, పావు చెంచా సోంపు.. గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని దంచి నీళ్లలో వేయాలి. వీటిలో తెనె నిమ్మరసం వేయకుండా పక్కన పెట్టుకోండి.

ఇక వాటర్ లో వేసినవి స్టౌ మీద పెట్టండి ..మరిగించిన తర్వాత ఈ కషాయం వడగట్టి అప్పుడు నిమ్మ తెనె కలుపుకోండి. .రోజుకు రెండు సార్లు ఈ కషాయం తాగితే జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.