సాధారణంగా పెరుగుతో అనేక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలుసు. పెరుగులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు శరీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా ఉండడం వల్ల ఎలాంటి వ్యాదులకైనా ఇట్టే చెక్ పెడుతుంది. కానీ పెరుగుతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఎలాగో మీరు కుడా చూడండి..
పెరుగుతో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఒక కప్పు పెరుగులో శనగ పిండి, కొద్దిగా పసుపును వేసి కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తరువాత కడగడం వల్ల మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారడంతో పాటు..చర్మం తెలుపుగా, మృదువుగా తయారవుతుంది.
పెరుగులో బియ్యం పిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వల్ల ముఖంపై ఉండే నలుపు తొలగిపోవడంతో పాటు..కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు సైతం క్రమక్రమంగా తగ్గిపోతాయి. కేవలం ఇవే కాకుండా ఎలాంటి చర్మ ససమస్యలు మన దరికి చేరకుండా కాపాడుతుంది.