మీ ముఖం కూడా హీరోయిన్ల ముఖంలా కాంతివంతంగా ఉండాలంటే ఇలా చేయండి..

0
86

సాధారణంగా గ్రీన్ టీతో అనేక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికి తెలుసు. గ్రీన్ టీలో  అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు శ‌రీరానికి మేలు అనేక పోషకాహారాలు ఉండడం వల్ల ఎలాంటి వ్యాదులకైనా ఇట్టే చెక్ పెడుతుంది. కానీ గ్రీన్ టీ తో  కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఎలాగో మీరు కుడా లుక్కేయండి..

మనకు తెలిసినంతవరకు గ్రీన్ టీ లో ఫైటో కెమికల్స్, ఫైటో ఫినాల్స్, అమైనో యాసిడ్లు, ఫాలిఫినాల్స్
పుష్కలంగా ఉండి బరువును తగ్గించడం, మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ కళ్ల కింద ముడతలను తగ్గించడం, కళ్ల కింద నల్లని వలయాలు తొలగించడంలో సహాయపడుతుంది. వారానికొకసారి గ్రీన్ టీ కళ్లపై అరగంటపాటు పాటు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

చర్మ క్యాన్సర్ ను రాకుండా చేయడంలో గ్రీన్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పింపుల్స్ ను కంట్రోల్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీని ఒక స్పూన్ తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లాటి నీటితో కడుక్కోవడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది.