ఖాళీ కడుపుతో ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉందా? అయితే ప్రమాదం పొంచివున్నట్టే..

0
42

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మనం తెలియక చేసే తప్పుల వల్ల కూడా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఖాళీ కడుపుతో ఉదయాన్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారికీ ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో టీ తాగడం వల్ల ఇతర పోషకాలు శోషించడాన్ని నిరోధించి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగిన తరువాత, నోటిలోని బ్యాక్టీరియా పేగులోకి చేరి వివిధ వ్యాధులకు దారి తీస్తుంది. కావున ఈ అలవాటు ఉన్నవారు వీలయినంత వరకు మానుకోవడం మంచిది.

అంతేకాకుండా తాజాగా చేసిన పరిశోధనలో తిన్న వెంటనే టీ తాగకూడదని వెల్లడయింది. దీనివల్ల మద్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే టీ తాగితే కచ్చితంగా రక్తపోటు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే టీ తాగితే గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉండడంతో పాటు..జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.