పురుషులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబ నియంత్రణ మాత్రలు పురుషుల కోసం త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకూ గర్భం రాకుండా ఉండాలి అంటే ఎక్కువగా కండోమ్స్ వాడుతున్నారు.పురుషుల కోసం ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ సాధనాలేవీ అందుబాటులోకి రాలేదు. దీని వల్ల అవాంచిత గర్భాలు వస్తున్నాయి.
అయితే మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బంది లేకుండా స్కాట్లాండ్లోని దుండీ యూనివర్సిటీ శాస్త్రవేత్త క్రిస్ బారాట్ ఇక పురుషుల కోసం మాత్రలు రానున్నాయి అని తెలిపారు. ఇవి రానున్న రెండు సంవత్సరాల్లో మార్కెట్ లోకి రానున్నాయట. వీటికోసం చాలా వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ పరిశోధనల్లో బిల్గేట్స్ అందించే నిధులు ఎంతగానో తోడ్పడనున్నాయి. వచ్చే రెండేళ్లలో 17 లక్షల డాలర్లను ఆయన ఈ కార్యక్రమానికి అందించనున్నారు. ఈ వార్త చదివిన వారు ఇది మంచి నిర్ణయమే అంటున్నారు.