ఓలా స్కూట‌ర్ రివర్స్ కూడా వెళుతుంది – కీ కూడా అక్క‌ర్లేదు ఇంకా ఎన్నోఫీచ‌ర్లు

The Ola scooter also goes in reverse

0
39

వ‌చ్చే రోజుల్లో అంతా విద్యుత్ వాహ‌నాలే మార్కెట్లో క‌నిపించ‌నున్నాయి. ఆయా కంపెనీలు కూడా ఈ మోడ‌ల్స్ వెహిక‌ల్ త‌యారీలో ఆర్ అండ్ డీ చేస్తున్నాయి. ప‌లు కంపెనీలు ఇప్ప‌టికే
విద్యుత్ ఆధారిత వాహనాలని మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పుడు అంద‌రూ ఓలా సంస్థ
నుంచి వ‌స్తున్న స్కూట‌ర్ కోసం చూస్తున్నారు.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇక బుకింగ్స్ కూడా చాలా మంది చేసుకున్నారు. అయితే ఈ స్కూట‌ర్ ఫీచ‌ర్లు చాలా బాగున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కూ లేని ఓ కొత్త ఫీచ‌ర్ ఉంది. ఈ స్కూటర్ ను రివర్స్ గేర్ లోనూ నడపొచ్చు. ఓలా స్కూటర్ లో రివర్స్ మోడ్ కూడా ఉంటుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవీష్ అగర్వాల్ వెల్లడించారు.
ఏ బండికి అయినా తాళం ఉండాల్సిందే కాని ఓలా స్కూట‌ర్ కి మాత్రం తాళం చెవి అక్కర్లేకుండా యాప్ ద్వారానే దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా ఓ కొత్త ఫీచ‌ర్ అలాగే దీని చార్జ్ విష‌యానికి వ‌స్తే
కేవలం 18 నిమిషాల్లో సగం చార్జింగ్ చేయొచ్చట. ఆ సగం చార్జింగ్ తోనే 75 కిలోమీటర్లు ప్రయాణం చేయ‌వ‌చ్చు అని చెబుతున్నారు. ఈ స్కూట‌ర్ కోసం ల‌క్ష‌లాది మంది వెయిట్ చేస్తున్నారు.