తొలి ఏకాదశి రోజున ఇది కచ్చితంగా తినాలట ఎందుకంటే

Toli Ekadashi day Special story

0
271

తొలి ఏకాదశి హిందువులు తొలి పండుగగా చెబుతారు. విష్ణు ఆలయాలు అన్నీ భ‌క్తుల‌తో కిటకిటలాడుతాయి. తొలి ఏకాదశి రోజున ఏ పని చేపట్టినా అంతా మంచే జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అని పెద్దలు చెబుతారు. (ఆరోగ్యం సహకరించే వారికి మాత్రమే ).

ఇక ఏకాదశి వ్రతం కూడా చాలా మంది చేసుకుంటారు. ఏకాదశి నాడు భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయ‌డం వ‌ల్ల ఎంతో పుణ్యం. ఈరోజు ఉపవాస దీక్ష ఆచరించిన వారు మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే ఈ రోజు ఏ పని చేసినా విజయం వరిస్తుంది.

ఈరోజు గోవులని పూజిస్తే వందేళ్ల పుణ్య ఫలం దక్కుతుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. దీనికి కారణం కూడా చెబుతారు.పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందుకే ఈ రోజు వారిని మనం గుర్తు చేసుకుంటు ఈ పేలాల పిండి తినాలి అని చెబుతారు. ఇక వర్షాలు పడే సీజన్ కాబట్టి ఈ సమయంలో పేలాల పిండి తింటే వేడి చేస్తుంది. ఆనాటి నుంచి దీనిని ఆలయాల్లో ప్రసాదంగా కూడా ఇస్తున్నారు. ఇంటికి వచ్చిన వారికి కూడా పేలాల‌ పిండి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది.