ఆషాడమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు

Why Henna is put in the month of Ashadam

0
118

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు చెట్లు ఎక్కడ ఉన్నాయా అని చూస్తారు. చేతికి గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండితే మురిసిపోతారు. ఇక పెళ్లికాని అమ్మాయిలు కూడా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అనే సరికి సిగ్గుపడతారు. ఆషాడంలో కాళ్లు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు మహిళలు. ఈ సీజన్ అంటే వర్షాల సీజన్. ఈ సమయంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి వాతావరణంలో.

ఈ సీజన్లో వైరల్ ఫీవర్లు వస్తాయి సూక్ష్మక్రిములు అటాక్ చేస్తాయి. ఇక చేతికి ఈ గోరింటాకు ఉండటం వల్ల ఎలాంటి క్రిములు దరిచేరవు, ఏదైనా పట్టుకున్నా, ముట్టుకున్నా అక్కడ క్రిములు శరీరానికి అంటవు. నీరు ఎక్కువ వాడతారు కాబట్టి గోళ్లకి ఎలాంటి సమస్యలు రావు. ఇక గోటి సమస్యలు ఉంటే అవి కూడా తగ్గుతాయి. చేతిగోటిలో నీరు చేరి కాస్త పగుళ్లు వస్తాయి, గోరింటాకు పెడితే ఆ సీజన్లో గోళ్ల సమస్యలు తగ్గుతాయి.

అయితే ఎర్రగా పండేందుకు నిమ్మరసం, బెల్లం, పంచదార, మందారం ఇలా చాలా వాడుతూ ఉంటారు. అయితే సాధారణ ఆకుని పెట్టుకుంటేనే మంచిది అంటారు మన పెద్దలు.