సాధారణంగా అందరికి పులిపిర్లు ఉంటాయి. కనీసం ఒక్కరికి ఒక్క పులిపిరైనా తప్పకుండా ఉంటుంది. వీటిని తొలగించుకోవడానికి కొంతమంది అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతకాలం తరువాత అవి మళ్ళి రావడం మనం గమనిస్తూనే ఉంటాము. పులిపిర్లు వైరస్ ఇన్ ఫెక్షన్ కారణంగా ఇవి వస్తాయి. వీటిని శాశ్వతంగా తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..
ఇవి మెడపై, ముఖంపై ఉండడం వల్ల చూడడానికి అందవిహీనంగా కనిపిస్తాయి. పులిపిర్లు ఉన్నవారు ఉడికించిన ఆహారాన్ని అధికంగా తీసుకోకుండా మూడు పూటలా కేవలం పచ్చి ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల పులిపిర్లు వాటంతటవే రాలిపోయి.70 శాతంవరకు పులిపిర్లు రాకుండా ఉంటాయి.
కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే అవి రాలిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి. పులిపిర్లను తొలగించడంలోనూ వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.