హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ఈసీగా తగ్గించుకోండి

0
37

ఎవరైనా అతిగా మద్యం సేవించడం వల్ల హ్యాంగోవర్ సమస్య వస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ సమస్య అందరిని చాలా ఇబ్బంది పెడుతుంది. హ్యాంగోవర్ సమస్య వల్ల తలనొప్పి, వికారం, బద్ధకం, అలసట, నీర‌సం వంటి లక్షణాలు కనిపించడంతో  ఈ సమస్య నుండి బయటపడటానికి ఎన్నెన్నో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటాము.

అలాగే వాటితో పాటు ఇవి కూడా పాటిస్తే హ్యాంగోవర్ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. విట‌మ‌న్ ‘సి’ హ్యాంగోవ‌ర్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కావున విట‌మ‌న్ ‘సి అధికంగా ఉన్న పండ్లు, ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు. హ్యాంగోవ‌ర్ త‌గ్గాలంటే గుడ్డు అధికంగా తినాలని సూచిస్తున్నారు.

హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు కొద్దిగా అల్లం ర‌సం తాగడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మజ్జిగను బాగా ప‌లుచ‌గా చేసి అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుండాలి. లేదంటే నిమ్మకాయ రసం తాగుతూ ఉండాలి. దీంతో మిన‌ర‌ల్స్ లభించి ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. న‌ట్స్, కొబ్బ‌రినీళ్లు, అర‌టి పండ్లు, వెన్న‌ వంటి పదార్దాలు తినుకోవడం వల్ల కుడా మంచి ఫలితాలు లభిస్తాయి.