మతిమరుపు సమస్యా..అయితే ఇలా చేయండి

0
98

వృద్ధాప్యం వచ్చిందంటే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మతిమరుపు. డాక్టర్‌ అలోయిస్‌ అల్జీమర్స్‌ అనే వైద్యుడు ఈ వ్యాధిని 1906 లో ప్రపంచానికి తెలియజేశారు. మానసిక అరోగ్య సమస్యతో బాధపడుతున్న మహిళ మెదడులోని కణాల్లో మార్పులను గుర్తించిన డాక్టర్‌ అల్జీమర్స్‌..దీని ద్వారా మతిమరుపు సమస్య వస్తుందని చెప్పారు.

ఈ సమస్య మొదలవగానే మెదడులోని నరాల కణాల మధ్య కనెక్షన్లు బలహీనమవుతాయి. దాంతో వ్యక్తి కూడా ఆలోచించడం మానేసి, రోజువారీ కార్యకలాపాలు చేయడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తాడు. అల్జీమర్స్..చిత్తవైకల్యం రూపం. దీనితో బాధపడుతున్న వ్యక్తులు మర్చిపోవడం అలవాటు చేసుకుంటారు.

అంతేకాకుండా ఎక్కువగా ఉప్పు తీసుకోవడం కూడా అల్జీమర్స్ కు కారణమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. కరోనా సమయంలో మన తినే ఆహారపు అలవాట్ల మీదే మన ఆరోగ్యం అధారపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు త్వరలోనే బ్రెయిన్ షార్ప్ అవడానికి కావాల్సిన క్లినికల్ ట్రయల్ కూడా చేపట్టనున్నారు.

బ్లూ బెర్రీస్ ను ఎక్కువగా తినడం వల్ల కూడా మతిమరుపును దూరంగా పెట్టవచ్చు. ఎందుకంటే వీటిలో ఫ్లేవనాయిడ్స్, ఫోటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్యను నివారించవచ్చు.

తిమరుపు రాకుండా ఉండాలంటే మానసికంగా,  ఆందోళన పడకుండా ఉండాలి. అలాగే ఏవైనా పజిల్స్ నింపడం, చేయడంవల్ల మెదడు పదును ఎక్కుతుంది.