F3 సెట్ లో పుష్పరాజ్ సందడి..!

Pushparaj noise on F3 set ..

0
34

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌-3’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, తాజాగా ఈ సినిమా సెట్‌లోకి ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ సడెన్‌ ఎంట్రీ ఇచ్చారు.

ఆయన రాకతో సెట్‌ మొత్తం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. వెంకీ, వరుణ్‌లతో బన్నీ సరదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎఫ్‌-3’ టీమ్‌ కొన్ని ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఎఫ్‌-2’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరీన్‌ సందడి చేయనున్నారు. సునీల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.