గర్భవతులు ఆరెంజ్ జ్యూస్ తాగవచ్చా తాగకూడదా?

గర్భవతులు ఆరెంజ్ జ్యూస్ తాగవచ్చా తాగకూడదా?

0
92

ఆరెంజ్ జ్యూస్ మంచి పోషకాలు సీ విటమిన్ ఉంటే జ్యూస్.. దీనిని తాగితే వెంటనే అనర్జీ వచ్చిన ఫీల్ ఉంటుంది, ఇక ఆరెంజ్ పండు కంటే జ్యూస్ తాగేవారు చాలా మంది ఉంటారు, అయితే గర్బవతులు ఈ రసం తాగకూడదు అని కొందరు అంటారు..మరికొందరు మాత్రం నిక్షేపంగా తాగచ్చు అంటారు, మరి దీని గురించి తెలుసుకుందాం.

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని రకాల పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అలాగే బిడ్డ ఎదుగుదల కూడా సరిగ్గా ఉంటుంది. నారింజ పండు జ్యూస్ కూడా ఆరోగ్యానికి ముఖ్యమైనదే. దీనిని తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు, ఇది తీసుకోవడం వల్ల రోజుకి ఓ గ్లాస్ తీసుకుంటే బిడ్డకు చాలా మంచిది, విటమిన్ సీ శరీరానికి అందుతుంది.

బిడ్డ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో బిడ్డ పుట్టాక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కనుక గర్భిణిలు రోజూ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఇక ఐరెన్ కూడా పుష్కలంగా వస్తుంది, బిడ్డ ఎదుగుదలకు అవసరం అయ్యే ఫోలేట్ దీని నుంచి వస్తుంది.