కొంతమందికి ఉదయం తొందరగా నిద్ర లేచే అలవాటు ఉంటుంది. మరికొంతమంది ఉదయం తొమ్మిది దాటినా కూడా నిద్ర లేవరు. అయితే ఈ రెండిట్లో ఏ అలవాటు ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజు పరిమిత స్థాయిలో నిద్రపోవాలి. ముఖ్యంగా ఉదయం తొందరగా నిద్ర లేచేవారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
తెల్లవారుజామునే నిద్రలేచే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అందుకే ఎవరికైనా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది. ఈ వ్యాధి వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాల సామర్థ్యం మెల్లమెల్లగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మతిమరుకు రావడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజుకు తొమ్మిది నుంచి పదకొండు గంటలు నిద్రపోయే వారిలో 40 శాతం గుండెకు సంబధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అధికంగా బరువు పెరగడానికి కారణం కూడా ఇదే. అందుకే రోజు పరిమిత స్థాయిలో నిద్రపోవాలి.