కలబంద వలన ఆరోగ్యానికి, సౌందర్యానికి కలిగే ప్రయోజనాలివే..

0
37

ప్రకృతిలో అనేక రకాల ఔషద మొక్కలు ఉంటాయి. పూర్వంలో ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన ఔషద మొక్కలతో ఆయుర్వేద వైద్యులు సమస్యలను నయం చేసేవారు. ముఖ్యంగా కలబంద, తులసి, వేప వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం కలబంద వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.

ఇది కేవలం ఆరోగ్యాంగానే కాకుండా..అద్దాన్ని పెంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలోవెరా మొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కావున దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడానికి కలబంద అద్భుతంగా ఉపయోగపడుతుంది.

కలబంద, చర్మంపై వచ్చే మంట, దురద మరియు కాలిన గాయాలకు తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట కలబందను నేరుగా మొటిమలపై రాసుకుని ఉదయం ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవడం వల్ల అనుకున్న దాని కంటే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా కలబందలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు కూడా ఉంటాయి.