దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య రోజురోజుకూ దిగి వస్తోంది. సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 6,990 కేసులు నమోదయ్యాయి. 551 రోజుల తర్వాత కేసుల సంఖ్య ఈ స్థాయిలో నమోదయ్యాయి.
మొత్తం కేసులు: 3,45,70,274
మొత్తం మరణాలు: 4,68,980
యాక్టివ్ కేసులు: 1,00,543
మొత్తం కోలుకున్నవారు: 3,40,18,299
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఒక్కరోజే 4,44,453 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 5,407 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,23,71,931కి చేరగా..మొత్తం మరణాల సంఖ్య 5,224,403కు చేరింది.
సోమవారం ఒక్కరోజే 78,80,545 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ 1,23,25,02,767కు చేరింది.