గుడ్ న్యూస్..భారీగా తగ్గిన కరోనా కేసులు..రికవరీ రేటు ఎంతంటే?

0
108

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలకు భారీ ఊరట లభించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,168 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 21 మంది మరణించారు. ఒక్కరోజులో 9,685 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.14 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం కేసులు: 4,44,22,246

క్రియాశీల కేసులు: 59,210

మొత్తం మరణాలు: 5,27,932

కోలుకున్నవారు: 4,38,55,365