గుడ్ న్యూస్..తగ్గిన కరోనా కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

0
115

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసులు తగ్గడం ప్రజలకు ఊరట కలిగిస్తుంది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 9,531 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించారు. 24 గంటల వ్యవధిలో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. యాక్టివ్ కేసులు 0.22 శాతం ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతం ఉంది.

మొత్తం కేసులు: 44,348,960

క్రియాశీల కేసులు: 97,648

మొత్తం మరణాలు: 5,27,368

కోలుకున్నవారు: 4,37,23,944