పెద్ద నోటితో గిన్నీస్ బుక్ రికార్డు – ఆమె ఎవ‌రంటే

Guinness Book of Record With a large mouth

0
93

గిన్నీస్ బుక్ రికార్డులో పేరు న‌మోదు చేసుకోవాలి అని చాలా మందికి క‌ల ఉంటుంది. దీని కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. ఎవ‌రికి సాధ్యం కాని ప‌నులు చేస్తారు. ఇక మ‌రికొంద‌రు వీటికోసం క‌ఠోర శ్ర‌మ చేస్తారు. అయితే తాజాగా ఓ మ‌హిళ త‌న నోటితో గిన్నీస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కింది. మ‌రి ఆమె ఎవ‌రో చూద్దాం.

టిక్ టాక్ ద్వారా ప్రాచుర్యాన్ని పొందిన 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్‌ తన అతిపెద్ద నోటితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కొట్టేసింది. ఈమె అమెరికాలో నివాసం ఉంటోంది. తాజాగా ఆమె పేరిట రికార్డ్ న‌మోదు చేశారు.ఆమె నోరు 6.52 సెంటీమీటర్లు ఉంటుంది.

ఆమె దవడ పెద్దగా సాగిపోతుంది. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికి ఈ రికార్డ్ లేదు. అన్నీ కోల‌త‌లు తీసుకున్న త‌ర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద నోరు కలిగిన మహిళగా కన్ఫామ్ చేశారు. ఇక ఆమెనోరు చిన్న‌త‌నం నుంచి ఇలా పెద్ద‌గా ఉండేది .అనేక ఫోటోలు కూడా ఆమె పంచుకుంది. ఆమె నోటితో నాలుగు బ‌ర్గ‌ర్లు తినేస్తుంది. పెద్ద సైజ్ ఆపిల్ కూడా ప‌ట్టేస్తుంది ఆమె నోటి నుంచి.