మనలో చాలామంది జ్యూస్ తాగడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. ఎందుకంటే దీనిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు..ఎలాంటి సీసనల్ వ్యాదులకైనా ఇట్టే చెక్ పెడుతుంది. అంతేకాకుండా రుచి కూడా బాగుంటాడనే కారణంతో తాగుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో జ్యూస్‌లను తీసుకోవడం అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఈ జ్యూస్‌లను తాగితే శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. ఉదయం ఖాళీ కడుపుతో చల్లని జ్యూస్ ఎట్టిపరిస్థితులలో తాగకూడదు. ఎందుకంటే ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
కానీ ఉదయాన్నే చల్లటి రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో వివిధ రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఖాళీ కడుపుతో నారింజ, సీజనల్, ద్రాక్షపండు లేదా నిమ్మరసం తాగడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలువచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉండడం వల్ల అసిడిటీ సమస్య రావొచ్చు. కావున ఖాళీ కడుపుతో జ్యూస్ తాగే అలవాటు ఉంటే వీలయినంత త్వరగా మానుకోవడం మంచిది.