Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

-

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మన రోగనిరోధక శక్తి అత్యంత బలహీనంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనం తీసుకునే ఆహారంలో చలికాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

- Advertisement -

ఆహారాన్ని తీసుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే చాలా రోగనిరోధక శక్తి బలంగా మారడమే కాకుండా ఎన్నో ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకోసం మన తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాను తప్పకుండా కలుపుకోవాల్సి ఉంటుంది. వాటిలో తెల్ల నువ్వులు చాలా ముఖ్యం. వీటిని చాలా మంది నువ్వులతో ఏం లాభం.. అని కొట్టిపారేస్తుంటారు. కానీ వీటిని సరైన క్రమంలో తీసుకుంటే అమృతంటా పనిచేస్తాయని, అందులోనూ చలికాలంలో మనల్ని అన్ని రకాల వ్యాధులు, రోగాల నుంచి కాపాడటంలో నువ్వులు నూరు శాతం సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.

ప్రతి రోజూ ఒక స్పూనుడు తెల్ల నువ్వులు(Sesame Seeds) తింటే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వీటిని చలికాలం ప్రారంభం నుంచే మన ఆహారంలో భాగం చేసుకోవడం ప్రారంభించాలి. వీటిని ఎలాగైనా తినొచ్చు. వట్టివి తిన్నా, చిక్కీలుగా చేసుకుని తిన్నా, అరిసెలు వంటి పిండి పదార్థాల్లో కలుపుకుని తిన్నా ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయట. మరి అసలు నువ్వులు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి చూద్దామా..

చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol): తెల్ల నువ్వులను ప్రతి రోజూ తినడం ద్వారా శరీరంలో పేరుకుపోయి ఉన్న చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుగుతుంది. తద్వారా పొట్ట, గుండెకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. నువ్వుల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చలికాలంలో సాధారణంగానే శారీరక శ్రమ తగ్గుతుంది.

అదే సమయంలో ఆహారం పట్ల కోరిక విపరీతంగా పెరుగుతుంది. అందువల్లే చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఈ సమస్యకు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే నువ్వులు చెక్ పెడతాయి. వీటిలో ఎక్కువగా ఉండే ఫైబర్ మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దాని వల్ల మనకు ఫుడ్ క్రేవింగ్స్ రావడం తగ్గుతుంది.

చర్మం(Skin): తెల్ల నువ్వులు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చలి కారణంగా చర్మం పొడిబారడం, నిర్జీవం కావడాన్ని తెల్ల నువ్వులు నియంత్రిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, తేమగా ఉంటుంది. చర్మంలో ఉండే మలినాలను తొలగించడంలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. డ్రై స్కిన్ వారికి ఇవి అద్భుత ఔషధంలా పనిచేస్తాయి.

ఎముకల బలం: నువ్వులు మన ఎముకలకు అమితమైన బలాన్ని అందిస్తాయి. అందుకు వీటిలో ఉండే ఐరన్, కాల్షియం కారణం. నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అది మన ఎముకలను బలంగా మారుస్తాయి. తద్వారా చలికాలంలో విపరీతంగా వచ్చే వెన్ను, కీల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా సాధారణ సమయాల్లో కూడా నువ్వులను ఆహారంలో కలుపుకోవడం ద్వారా ఈ నొప్పుల బారిన పడకుండా చూసుకోవచ్చు.

సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ: చలికాలంలో సీజనల్ వ్యాధుల బెడద తీవ్రంగా ఉంటుంది. దాని నుంచి మనల్ని బయటపడేయటంలో నువ్వులు కీలకంగా పనిచేస్తాయి. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేలా చేయడంలో నువ్వులు బాగా పనిచేస్తాయి. నువ్వులు తినడం ద్వారా శరీరం లోపలి నుంచి వేడి పుడుతుంది. ఇది అనేక బ్యాక్టీరియాల నుంచి మనల్ని కాపాడుతుంది.

చలికాలంలో నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యం మెరుగు పడుతుంది. నువ్వుల్లో పుష్కలంగా ఉండే జింక్.. మన రోగనిరోధక శక్తిని చురుగ్గా చేయడమే కాకుండా బలంగా మారుస్తుంది. చల్లటి వాతావరణం వల్ల అనేక బ్యాక్టీరియాల కారణంగా మనం రోగాల బారిన పడుతుంటాం. వాటి నుంచి ఈ నువ్వులు మనల్ని రక్షిస్తాయి.

Read Also: చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...