Ladyfinger Benefits: స్టైలిష్‌గా లేడీస్ ఫింగర్స్ అని పిలుచుకునే బెండకాయలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బెండకాయలు తింటే వచ్చే ఉపయోగాలు(Ladyfinger Benefits) గురించి తెలిస్తే, వారానికి ఒక్కసారైనా బెండకాయలు ఉండాల్సిందేనని అనక మానరు. వీటిల్లో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్ కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఉంటాయని నిపుణులు తెలిపారు. మెదడు సరిగ్గా పనిచేయటానికి ఉపయోగపడే ఫోలేట్, విటమిన్ బి9 వంటి పోషకాలు బెండకాయలో సమృద్ధిగా లభిస్తాయని వివరించారు. చెడు కొలస్ట్రాల్‌ను సైతం తగ్గించే పేక్టిన్ బెండకాయలో లభిస్తుంది. దీని వల్ల గుండె డబ్బులు త్వరగా నివారించేందుకు ఉపయోగపడుతుంది.
గర్భిణీలు కచ్చితంగా వారానికి ఒక్కసారైనా బెండకాయ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతుంటే బెండకాయను ఆహారంగా ఇవ్వటం ద్వారా, వీటిల్లో ఉండే విటమిన్ సి వల్ల త్వరగా కోలుకుంటారు. బెండకాయలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ప్రస్తుతం వయస్సుతో తేడా లేకుండా వస్తున్న క్యాన్సర్ కణాలను సైతం పెరగకుండా బెండకాయ నిరోధిస్తుంది. శరీరాన్ని శీతలీకరణ చేసేందుకు బెండకాయ ఉపయోగపడటంతో, వేసవిలో సమృద్ధిగా తినవచ్చు. కానీ బెండకాయను వండేటప్పుడు మసాలాలు దట్టించకుండా, తక్కువ పరిణామంలో వాడితే, బెండకాయలో ఉండే పోషకాలు శరీరానికి చేరుతాయి.