బూర వాయిస్తూ హల్‌చల్‌.. గుణపాఠం చెప్పిన పోలీసులు

-

దసరా వచ్చిందంటే దేశం మొత్తం సంబరల్లో మునిగి తేలుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుణ్ణాళ్లు పెట్టడం.. ఉత్సవాలను ఘనంగా చేయడం తెలిసిందే.. అయితే కొందరు యువకులు దసరా రోజున మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో బూర ఊదుతూ చూట్టు ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని గమనించిన పోలీసులు ఆ యువకులకు బుద్ది చెప్పారు. పోలీసులు ఇచ్చిన ట్రీట్‌‌మెంట్‌‌ను ఆ పోకిరీలు జీవితంలో మరిచిపోలేరు. అసలు ఏం జరిగిందంటే..

- Advertisement -

దసరా సందర్భంగా తిరుణ్ణాళ్లకు వెళ్లిన కొందరు యువకులు వారి వద్ద ఉన్న బూరలతో పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ.. రోడ్డుపై వెళ్తున్నారు. వారు చేస్తున్న శబ్ధాలకు చూట్టు ఉన్న ప్రజలు ఇబ్బంది పడటం అక్కడే ఉన్న పోలీసులు గమనించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి తగిన గుణపాఠమే చెప్పారు. బూర వాయిస్తన్న ఆకతాయిలను అడ్డగించి.. వారి చేతనే ఒకరి చెవుల్లో, ఒకరు బూర ఊదుకోవాలని పోలీసులు ఆదేశించారు.. వారు పెద్ద శబ్దంతో ఊదకపోవటంతో, పోలీసులే స్వయంగా బూర ఊది వారిని రోడ్డుపై కూర్చోబెట్టారు. ఇదంతా చూసిన ప్రజలు పోకిరీలకు సరైన బుద్ధి చెప్పారని కొనియాడారు. యువకులు చేస్తున్న అల్లరితో ప్రజలను ఇబ్బంది పెట్టడంతో వారి వికృత చేష్టలను అదుపు చేసేందుకు ఈ పద్ధతిని అవలంభించామని పోలీసులు చెబుతున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...