Tamarind Leaves: చింత చిగురు రుచికి పుల్లగా ఉంటుంది. చింత చిగురును కూడా మనం ఆకుకూరగా తీసుకుంటూ ఉంటాం. చింతచిగురును ఎలా తీసుకున్న ఆరోగ్యపరంగా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాబాలు పొందవచ్చు. చింత చిగురును ఎండబెట్టి పొడిగా చేస్తారు. ఇలా తయారు చేసుకున్న పొడిని వంటల్లో వేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం..
చింత చిగురును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గతుంది. కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా చింత చిగురుకు ఉంటుంది. చింత చిగురు రసంలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది.చింత చిగురు(Tamarind Leaves)ను తీసుకోవడం వల్ల శరీరంలో వాతం ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.
చింత చిగురును ఎక్కువగా తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయని ఒక ఆరోగ్య సర్వే ద్వారా తెలిసింది. గుండె జబ్బులను తగ్గించడం, శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడం వంటి లక్షణాలు కూడా చింత చిగురులో ఉన్నాయి.అంతేకాకుండా మూల వ్యాధుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.